అనుమతులు లేకుండా బోర్లు వేయొద్దు
అనుమతులు లేకుండా బోర్లు వేయొద్దు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 26 నివాస గృహాలు, వ్యవసాయం మినహా ఇతర కమర్షియల్, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమల కోసం బోర్ వెల్ అనుమతులను తప్పనిసరిగా తీసుకోవాలని, అలాంటి వాటికి అనుమతి లేకుండా బోర్లు వేయొద్దని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సూచించారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల్లో బోర్ వెల్ అనుమతులు, ఇతర అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కమర్షియల్, పరిశ్రమలు, ...