ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి నూతన వస్త్రాలు బహుకరించిన ఎమ్మెల్యే కొండ సురేఖ
ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి నూతన వస్త్రాలు బహుకరించిన ఎమ్మెల్యే కొండ సురేఖ తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 26 ఏళ్ల తరబడి గూడు లేక గుడిసెల్లో జీవిస్తున్న నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 41వ డివిజన్, ఉర్సు హరిజనవాడకు చెందిన గాదె స్వర్ణలత–అన్వేష్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి, నూతన వస్త్రాలు బహుకరించి, వారికి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ.