పంట మార్పిడి విధానాలపై రైతుల్లో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి:*

📌జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. పంట మార్పిడి విధానాలపై రైతుల్లో ఎప్పటికప్పుడు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులతో వ్యవసాయ సంబంధిత అంశాలపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.       ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత నీటి లభ్యత పరిస్థితుల నేపథ్యంలో తక్కువ నీటితో సులభంగా సాగయ్యే పంటలను మాత్రమే వేసేలా రైతులను అధికారులు ప్రోత్సహించాలని చెప్పారు. వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను సాగు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులంతా తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఉంటూ రైతులకు సహకారం అందించాలన్నారు. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగి, భూగర్భ జలాలు...