పలు ప్రాంతాల్లో వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

పలు ప్రాంతాల్లో వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 26, నవంబర్ నూతన వధూవరులను ఆశీర్వదించిన సంగారెడ్డి ఎమ్మెల్యే,పలు ప్రాంతాల్లో నిర్వహించిన వివాహ వేడుకల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు ఆత్మీయంగా స్వాగతం పలికారు.ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెంట మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, విఠల్, గోవర్ధన్ రెడ్డి, కసిని శ్రీకాంత్, అరవింద్ రెడ్డి, వెంకటేశం, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.