మామడ మండల బీజేపీలో మోర్చాల పదవుల చిచ్చు.. కష్టపడే కార్యకర్తలకు చోటు దక్కలేదని అసంతృప్తి!
మామడ మండల బీజేపీలో అనుబంధ మోర్చాల బాధ్యతల కేటాయింపు పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు ప్రకటించిన వివిధ మోర్చాల బాధ్యతలపై కొందరు పార్టీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా క్షేత్రస్థాయిలో కష్టపడుతూ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించలేదని కొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వారికి కాకుండా, బాధ్యతల కేటాయింపులో ఇతరులకు ప్రాధాన్యత ఇచ్చారనే అభిప్రాయాలు కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి. మోర్చాల నియామకాల విషయంలో పార్టీ నాయకత్వం మరోసారి పునరాలోచన చేయాలని, నిజమైన పార్టీ కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించాలని కొందరు కోరుతున్నట్లు తెలుస్తోంది....