రైతు, కార్మిక సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలం
రైతు, కార్మిక సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలం ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలి – సంయుక్త కిసాన్ మోర్చా హనుమకొండ:ప్రతినిధి తెలంగాణ కెరటం నవంబర్ 26 దేశవ్యాప్త సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా హనుమకొండ కాళోజీ సెంటర్లో రైతు, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గొడుగు వెంకట్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించాలని, స్వామినాథన్...