దీక్షా దివస్ను విజయవంతం చేయాలి.
దీక్షా దివస్ను విజయవంతం చేయాలి. హన్మకొండ ప్రతినిధి :తెలంగాణ కెరటం నవంబర్ 26 తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడి 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టమని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు.కేసీఆర్ దీక్ష తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపుగా నిలిచి రాష్ట్ర సాధనకు బాటలు వేసిందని అన్నారు. ఈ నెల 29న పరకాలలో నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,ఉద్యమకారులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చల్లా ధర్మారెడ్డి ...