రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత
రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత సంవిధాన్ రక్షా మార్చ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హన్మకొండ ప్రతినిధి:తెలంగాణ కెరటం నవంబర్ 26 హైదరాబాద్: భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన సంవిధాన్ రక్షా మార్చ్‌లో ఆయన పాల్గొన్నారు.ట్యాంక్‌బండ్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ప్రారంభమైన ర్యాలీ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవాలని నాగరాజు పిలుపునిచ్చారు....