హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించాలి
హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించాలి రాజ్యాంగ విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య (తెలంగాణ కెరటం) ఘట్కేసర్ ప్రతినిధి / నవంబర్ 26: భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులతో పాటు ప్రతి ఒక్కరూ తమ ప్రాథమిక విధులు, సామాజిక బాధ్యతలపై అవగాహన పెంపొందించుకోవాలని స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య పిలుపునిచ్చారు. ఘట్కేసర్ డివిజన్ పరిధిలోని ఎన్ఎఫ్సీ నగర్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి శాస్త్రీయ ఆలోచనా విధానం ఎంతో అవసరమని పేర్కొన్నారు. మూఢనమ్మకాలు, వివక్ష, సామాజిక...