ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాటికాయల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఫాతిమా మేరీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు, సీనియర్ పాత్రికేయులు బొల్లెపాక రాజేష్, యువజన సంఘాల నాయకుడు పట్ల ప్రవీణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరిస్తూ వారిలో రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య...