ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల సాకారం
ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల సాకారం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది ఫకీర్ టేక్య తండలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ (తెలంగాణ కెరటం) ఘట్కేసర్ ప్రతినిధి / నవంబర్ 26: ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం సంక్షేమ పాలనకు పెద్దపీట వేస్తోందని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ అన్నారు. ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్, ఘనపురం గ్రామ పరిధిలో ఉన్న ఫకీర్ టేక్య తండలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మాలోత్ సుగుణ, మూడవత్...