ధాన్యం కొనుగోలును సజావుగా నిర్వహించాలి
ధాన్యం కొనుగోలును సజావుగా నిర్వహించాలి హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 26 ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న, శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి అధికారులు, సంబంధిత కేంద్రాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు....