భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 26 ఏలుకుర్తి : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలుకుర్తి గ్రామంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏలుకుర్తి, రామన్నగూడెం గ్రామాల ప్రజలు, యువత, అంబేడ్కర్ అభిమానులు పాల్గొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని గౌరవిద్దాం  ప్రజాస్వామ్య విలువలను కాపాడుదాం అని తెలిపారు.