నవంబర్ 26 – భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన చారిత్రాత్మక రోజు
నవంబర్ 26 – భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన చారిత్రాత్మక రోజు తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 26 చింతలతాండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి అని రాజ్యాంగమే మన దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని చింతలతండా గ్రామ సర్పంచ్ రాజు గ్రామ ప్రజలకు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.