రాజ్యాంగ పరిరక్షణ మార్చ్‌లో పాల్గొన్న చెరుకు శ్రీనివాస్‌రెడ్డి

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 26,(తెలంగాణ కెరటం)భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే లక్ష్యంగా టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సంవిధాన్‌ రక్షక్‌ మార్చ్‌’లో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రజాస్వామ్య విలువలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ మార్చ్‌ను నిర్వహించారు. తొలుత హైదరాబాద్‌లోని లిబర్టీ వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి నాయకులు నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి నెక్లెస్‌ రోడ్డులోని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం వరకు మార్చ్‌ కొనసాగింది.ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌...