ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం.... ప్రతి ఒక్కరు రాజ్యాంగ విలువలను పాటించాలి సింగరేణి జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ.
తెలంగాణ కెరటం మంచిర్యాల బ్యూరో చీఫ్ రాం వేణు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమమును ప్రారంభించారు.అనంతరం జనరల్ మేనేజర్ గారి కార్యాలయ సిబ్బందితో కలిసి భారత రాజ్యాంగ పీఠిక (ప్రతిజ్ఞ)ను చేయించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ గారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు హృదయం వంటిది. ప్రతి భారత పౌరుడు అనుసరించాల్సిన ప్రాథమిక విలువలు, హక్కులు, బాధ్యతలను స్పష్టంగా నిర్దేశించిన గొప్ప పత్రం ఇది. రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి ప్రగాఢ పరిజ్ఞానం, దూరదృష్టి, సమానత్వ భావజాలం నేటికీ...