హనుమకొండలో విచ్చలవిడిగా బెల్లం చాయ్ ఔట్లెట్లు!
బెల్లం పేరుతో రసాయనాల వినియోగం జరుగుతోందా?ప్రజల ఆరోగ్యంతో చెలగాటమా.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు ఎక్కడ?నగరంలో పెరుగుతున్న బెల్లం టీ కేంద్రాలు.. పట్టించుకోని అధికారులు!హన్మకొండ ప్రతినిధి :తెలంగాణ కెరటం నవంబర్ 27హనుమకొండ నగరంలో బెల్లం చాయ్ పేరుతో కొత్తకొత్త ఔట్లెట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అయితే ఈ కేంద్రాల్లో నిజంగానే స్వచ్ఛమైన బెల్లంతో చాయ్ తయారు చేస్తున్నారా? లేక రుచి, రంగు కోసం ఇతర పదార్థాలు, రసాయనాలు కలుపుతున్నారా? అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.నగరంలో రోజురోజుకూ బెల్లం చాయ్ కేంద్రాలు పెరుగుతున్నప్పటికీ, వాటిలో ఉపయోగిస్తున్న బెల్లం నాణ్యత, తయారీ విధానం, పరిశుభ్రతపై సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆహార భద్రత నిబంధనలు పాటిస్తున్నారా లేదా...