విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు..
📌ప్రత్యేక పూజలు, హోమాలతో ఆధ్యాత్మిక సందడి నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కల్ గ్రామంలోశ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, వైదిక క్రతువులు నిర్వహించనున్నారు. మహోత్సవంలో భాగంగా సోమవారం సాయంత్రం 5 గంటలకు అమ్మవారి విగ్రహాన్ని మేళతాళాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య ఊరేగింపుగా తీసుకురానున్నారు. అనంతరం శ్రీశ్రీ వజ్ర సాయి కృష్ణ జోషి గారి బృందం ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ పవిత్ర మహోత్సవానికి భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.