పోడు భూముల పట్టాలపై ముఖ్యమంత్రి స్పందిస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది.
గుళ్లు, గోపురాలు కట్టండి.. రైతులకు సాగునీరు ప్రాజెక్టు సంగతేమి! మద్దిమడుగు సభలో సాగునీరు, పోడు భూముల పట్టాలపై ముఖ్యమంత్రి స్పందిస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. చెంచుల జీవనాధారమైన పోడు భూములకు పట్టాలేవి? స్థానిక ప్రజల ఆవేదన. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతి) (నవంబర్ 27):దేవాలయాలు నిర్మించండి. విగ్రహాలు ప్రతిష్ఠించండి. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయండి. వీటికి ఎవరూ వ్యతిరేకం కాదు. కానీ అదే సమయంలో ప్రజల కనీస అవసరాలైన తాగునీరు, రైతుల పంటలకు సాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.అచ్చంపేట నియోజకవర్గం పదర మండలం మద్దిమడుగు ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో సేవాలాల్...