గుడులకు నిధులు.. రోడ్లకు కోట్లు.
మరి పేద పిల్లల చదువులకు నిధులేవి?అచ్చంపేట సభలో విద్యారంగాన్ని విస్మరించిన సీఎం రేవంత్ రెడ్డి.ఏఐఎస్ఎఫ్ ఆగ్రహం!తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 27):ప్రభుత్వం అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, గుళ్లు, భవనాల నిర్మాణమేనా? పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వానికి పట్టదా? ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బలముల ప్రేమ్ కుమార్ మండిపడ్డారు.నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నవంబర్ 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభలో వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రకటనలు చేయడం జరిగిందని, అయితే ఈ ప్రాంతంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి కనీసం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం బాధాకరమని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బలముల...