రైతుల భూ సమస్యల పరిష్కారానికి భూభారతి రీ సర్వే దోహదం
రైతుల భూ సమస్యల పరిష్కారానికి భూభారతి రీ సర్వే దోహదం భూముల హద్దులపై స్పష్టతతో రైతుల మధ్య వివాదాలకు చెక్ – మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ పడమటి సాయిగూడెంలో భూభారతి భూ రీ సర్వేపై అవగాహన సదస్సు (తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 27: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్‌కేసర్ 6వ డివిజన్ పడమటి సాయిగూడెంలో భూభారతి భూ రీ సర్వేపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేఏసీ గౌరవ అధ్యక్షులు విజయేందర్ రెడ్డి, ఆర్డీఓ ఎన్. వెంకట్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్, ఘట్‌కేసర్ మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్...