కార్తీక మాసంలో కీసరగుట్ట రామలింగేశ్వర స్వామికి ఏనుగు సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు
కార్తీక మాసంలో కీసరగుట్ట రామలింగేశ్వర స్వామికి ఏనుగు సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో స్వామివారికి అభిషేకం.. ప్రజలందరికీ శివుడి ఆశీస్సులు కలగాలని ఆకాంక్ష (తెలంగాణ కెరటం) ఘట్కేసర్ ప్రతినిధి / నవంబర్ 27: కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకుని మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కీసరగుట్ట శ్రీ భవానీ శివ దుర్గ సమేత రామలింగేశ్వర స్వామివారిని మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఘట్కేసర్ మండలం మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కీసర డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కోలా బాలరాజు యాదవ్‌తో పాటు స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి...