విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు తప్పులు లేకుండా చూడాలి
విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు తప్పులు లేకుండా చూడాలి మండల విద్యాధికారి గంగుల నరేశం తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 27 : యూ డైస్ లో ప్రతి పాఠశాల విద్యార్థుల, ఉపాధ్యాయుల వివరాలు తప్పులు లేకుండా చూడాలని కోరుట్ల మండల విద్యాధికారి గంగుల నరేశం అన్నారు. శుక్రవారం కోరుట్ల ఎమ్మార్సీలో మండల స్థాయి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కె.జి.బి.వి స్పెషల్ ఆఫీసర్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లకు మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి గంగుల నరేశం మాట్లాడుతూ ప్రతి పాఠశాల యొక్క విద్యార్థుల, ఉపాధ్యాయుల వివరాలు యూ డైస్-2026-2027 లో తప్పులు లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా...