అధిక వడ్డీ, అక్రమ చిట్టీ వ్యాపారులపై పోలీసుల మెరుపు దాడులు వడ్డీల పేరుతో వేదిస్తే కఠిన చర్యలు తప్పవు.... జిల్లా ఎస్పీ నితికా పంత్.

జిల్లావ్యాప్తంగా 57 మంది ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు. 16 కేసులు నమోదు.. 102 ప్రామిసరీ నోట్లు, 63 ఖాళీ చెక్‌బుక్‌లు స్వాధీనంl తెలంగాణ కెరటం మంచిర్యాల బ్యూరో చీఫ్ రాం వేణు.కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అధిక వడ్డీ వ్యాపారులు, అక్రమ చిట్టీ నిర్వాహకులపై జిల్లా పోలీసులు కొరడా ఝళిపించారు. రైతులు, సామాన్య ప్రజల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ, చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం జిల్లా వ్యాప్తంగా 57 మంది అధిక వడ్డీ వ్యాపారులు, చిట్టీ...