తూప్రాన్ లో మహిళ మృతి పోలీసులు దర్యాప్తు

 తెలంగాణ కెరటం తూప్రాన్ నవంబర్ 27 ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్ వెనుక గల్లీలో నివాసముంటున్న జక్కపోరం మనస్వి, వయస్సు 29 సంవత్సరాలు, కులం ముదిరాజ్, అనే మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని మృతి చెందినది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అక్కడ ఒక సూసైడ్ నోట్ లభించింది. సదరు సూసైడ్ నోట్‌లో తన భర్త, కుటుంబ పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, చికిత్సకు సంబంధించిన విషయాలతో పాటు తన పిల్లల గురించి కూడా ప్రస్తావించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.మహిళ మృతికి అనారోగ్యం వలన మనస్థాపం చెందినట్లు సూసైడ్ నోట్‌లోని అంశాల ఆధారంగా తెలుస్తుంది, తదుపరి కుటుంబ సభ్యుల...