కోక్యాతండాలో అధికార పార్టీ సర్పంచ్ ఒంటెద్దు పోకడ..!!

అనుమతి లేకుండా పంచాయితీ భవనం కూల్చివేత పంచాయితీ రాజ్ చట్టం సెక్షన్ 37 ఉల్లంఘన ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డగించిన గ్రామస్తులు ఎంపిడిఓ తీరు పై ప్రజల్లో సర్వత్రా విమర్శలు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఖమ్మం , నవంబర్ 27 (తెలంగాణ కెరటం ) : ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా పారదర్శకమైన పాలన చేపట్టాల్సిన గ్రామ సర్పంచ్ తన పదవిని దుర్వినియోగం చేశాడు.ప్రభుత్వం నుండి అధికారిక అనుమతి(ఆర్డర్)లేకుండానే ఏకంగా పంచాయితీ భవనాన్నే కూల్చివేసి తీవ్ర దుమారానికి తెరలేపాడు.కూసుమంచి మండలంలోని కోక్యాతండాలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ ఒంటెద్దు పోకడలు గ్రామంలో వివాదాస్పదంగా మారాయి.అధికార పార్టీ సర్పంచ్ ను,నేను చెప్పిందే వేదం,నామాటకు లేదు ఎదురు...