రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ అధికారులు

తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 27, నవంబర్ రూ.4.50 లక్షల కాంట్రాక్టు బిల్లు మంజూరుకు లంచం డిమాండ్సదాశివపేట మున్సిపాలిటీలో ఏసీబీ అధికారుల మెరుపు దాడి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. రూ.15 వేల లంచం తీసుకుంటూ ఇద్దరు మున్సిపల్ అధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.ఏసీబీ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. సదాశివపేట మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఏ. రాజేష్ కుమార్, అవుట్‌సోర్సింగ్ విధానంలో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఏ. శివారెడ్డి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.సదాశివపేట పట్టణంలోని ఊబ చెరువులో 2026 గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి చేపట్టిన పూడికతీత...