కాంగ్రెస్ తెచ్చిన కరువుకు కోమటిరెడ్డి మాటలే నిదర్శనం!

సాగునీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యమే రైతుల పాలిట శాపం కాళేశ్వరం, కృష్ణా–గోదావరి జలాల వినియోగంపై హరీష్ రావు మొదటి నుంచి చేస్తున్న ఆరోపణలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయన్న జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, యాట యాదగిరి చిన్నకోడూర్, నవంబర్ 27, శుక్రవారం:తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న కరువు పరిస్థితులకు ప్రకృతి వైపరీత్యాలే కారణమా? లేక అందుబాటులో ఉన్న సాగునీటిని సమర్థవంతంగా వినియోగించడంలో ప్రభుత్వ వైఫల్యమా? అనే ప్రశ్న ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాగునీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు మొదటి నుంచి చేస్తున్న విమర్శలకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన తాజా...