నీరు తగ్గడంతో భక్తులకు దర్శనమిస్తున్న పొన్కల్ సదర్మాట్ బ్యారేజ్‌లోని శ్రీ హనుమాన్ స్వామి

నిర్మల్ జిల్లా పొన్కల్ సదర్మాట్ బ్యారేజ్‌లో ముంపునకు గురైన శ్రీ హనుమాన్ ఆలయంలో నేడు ప్రత్యేకంగా స్వామివారి విగ్రహానికి ఉన్న సింధూరాన్ని తొలగించి, స్వామివారి నిజ స్వరూపంలో భక్తులకు దర్శనం కల్పించారు. డ్యాంలో నీటిమట్టం తగ్గడంతో ఆలయం వెలుపలికి కనిపించగా, హనుమాన్ భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాలాకాలం తర్వాత స్వామివారిని నిజ స్వరూపంలో దర్శించుకోవడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.