ప్రజారోగ్యానికి భరోసా.. వన్యప్రాణుల సంరక్షణకు అండగా మరో ముందడుగు.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (నవంబర్ 28):నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అచ్చంపేట నియోజకవర్గ ప్రజలతో పాటు చెంచు పెంటల్లో నివసించే గిరిజన ప్రజలకు క్షయవ్యాధి (టీబీ ) నివారణ, ముందస్తు గుర్తింపు లక్ష్యంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి ఎస్బిఐ చైర్మన్ శ్రీనివాస్ శెట్టి తో మాట్లాడి ఎస్బిఐ ఫౌండేషన్ సహకారంతో సి ఎస్ ఆర్ నిధుల ద్వారా ప్రత్యేక టీబీ పరీక్షల అంబులెన్స్‌ను ఏర్పాటు చేయించారు.భవిష్య భారత్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఈ అంబులెన్స్ ద్వారా మారుమూల గ్రామాలు, చెంచు పెంటల్లో ప్రజలకు టీబీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రానున్నాయని అదేవిధంగా బి ఏ...