ఘనంగా పూలే వర్ధంతి. నివాళులర్పించిన బిసి పొలిటికల్ జేఏసీ నాయకులు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 28):నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో శనివారం స్థానిక బీసీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా బీసీ సంఘాల నాయకులు, బీసీ కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బిజెపి పొలిటికల్ జేఏసీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ ఆచారి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను నెరవేర్చాలని ఆయన చూపిన అడుగుజాడల్లో నడవాలని సూచించారు.