బజార్ కొత్తూరులో బీఆర్ఎస్ గ్రామ శాఖ సమావేశం

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి నిజామాబాద్ జిల్లా తెలంగాణ కెరటం నందిపేట్ మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు, నందిపేట్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ గారి ఆధ్వర్యంలో నందిపేట్ మండలం బజార్ కొత్తూరు గ్రామంలో భారత రాష్ట్ర సమితి పార్టీ గ్రామ శాఖ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పార్టీలో నూతనంగా చేరిన యువకులు, నాయకులకు పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని నాయకులకు సూచించారు.తెలంగాణ...