మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

తెలంగాణ కెరటం భారతదేశ సామాజిక విప్లవ పితామహుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా దళిత మేధా శక్తి (DMS) నర్సంపేట మండల అధ్యక్షులు శ్రీ కుక్కమూడి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా శ్రీ దళిత మేధా శక్తి (DMS) వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బోట్ల పవన్ - న్యాయవాది గారు పాల్గొని మహాత్మా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ, సమాజంలో పేరుకుపోయిన కుల వ్యవస్థ ను అంతమోందించుట కొరకు, కుల వివక్షను రూపుమాపడానికి, మహిళా విద్యను  ప్రోత్సహించడానికి ఫూలే చేసిన త్యాగాలు...