విద్య విముక్తికి ఆయుధం – కులవివక్ష నిర్మూలనకు యువత కృషి చేయాలి: పాలడుగు నాగార్జున
తెలంగాణ కెరటం నల్గొండ జిల్లా ప్రతినిధి (నవంబర్28);మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకొని విద్య, సామాజిక సమానత్వం, మహిళా సాధికారత కోసం కృషి చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు.స్థానిక నల్గొండ బీసీ హాస్టల్లో మహాత్మా జ్యోతిబా ఫూలే 136వ వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జ్యోతిబా ఫూలే తన జీవితాన్ని అణగారిన వర్గాల విముక్తి కోసం, మహిళా విద్యాభివృద్ధి కోసం, కులవివక్ష నిర్మూలన కోసం అంకితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు.1873లో రచించిన గులాంగిరి పుస్తకం ద్వారా కులవ్యవస్థలోని అసమానతలను ఎండగట్టి, శూద్ర, అతిశూద్రుల...