నెల్లూరు గ్రామపంచాయతీలో చెత్తబుట్టల పంపిణీ
తెలంగాణ కెరటం వెల్దుర్తి ప్రతినిధి నవంబర్ 28వెల్దుర్తి మండలం నెల్లూరు గ్రామపంచాయతీలో ప్రజలకు చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ రంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, గ్రామ పాలకవర్గం, ప్రజలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను చెత్తబుట్టల్లోనే వేయాలని సర్పంచ్ ప్రజలకు సూచించారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా వేయడం వల్ల గ్రామ పరిశుభ్రత మెరుగుపడుతుందని తెలిపారు. పరిశుభ్రమైన గ్రామం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.ప్రజల ఆరోగ్యం కోసం పరిశుభ్రత చాలా అవసరమని అధికారులు తెలిపారు. చెత్తబుట్టలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో విగ్నేశ్వర్, ఆర్ఐ నర్సింగ్...