మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి.
మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. మద్యపానం నియంత్రించాలి డ్రగ్స్ ను పూర్తిగా అరికట్టాలి. అశ్లీల చిత్రాలు సినిమాలపై సెన్సార్ విధించాలి. ఆడపిల్లలను పుట్టనిద్దాం. ఎదగనిద్దాం. చదవనిద్దాం. అన్నారు.వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బాలికల హాస్టల్లో సందర్శించి సెమినార్ ఐద్వా జిల్లా కార్యదర్శి అనసూయ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి పాల్గొని మాట్లాడుతూ....దేశంలో రోజురోజుకు మహిళలపై విద్యార్థినిలపై హత్యలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. దీనికి మూల కారణం ప్రభుత్వ పాలకుల అనుసరిస్తున్న విధానాలు కారణమన్నారు. దేశంలో మారుమూల గ్రామాల వరకు మద్య పానీయం ఏరులై పారుతుంది నియంత్రించాలి. డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోతుంది అరికట్టాలి.అశ్లీల చిత్రాలు అశ్లీల పోస్టర్లు రోజురోజుకు...