వెల్దుర్తి: ఉప్పు లింగాపూర్ సీతారామ ఆలయం వార్షికోత్సవం
వెల్దుర్తి: ఉప్పు లింగాపూర్ సీతారామ ఆలయం వార్షికోత్సవం తెలంగాణ కెరటం వెల్దుర్తి ప్రతినిధి నవంబర్ 28 వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ సీతారామ ఆలయం వార్షికోత్సవ విశేష పూజలు శనివారం నాడు భక్తిశ్రద్ధలతో జరిగాయి.ఈ సందర్భంగా గణపతి పూజ, అభిషేకాలు, హోమము నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.ఆలయ ప్రాంగణం భక్తి భావంతో నిండిపోయింది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వార్షికోత్సవం సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు.