ఈటలపై విమర్శలు చేస్తే సహించేది లేదు! కౌశిక్ రెడ్డికి బీజేపీ నాయకుల హెచ్చరిక
హుజురాబాద్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం.. ఈటల హయాంలోనే నియోజకవర్గానికి మహర్దశ హన్మకొండ ప్రతినిధి:తెలంగాణ కెరటం నవంబర్ 28 హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎంపీ ఈటల రాజేందర్‌పై చేసిన వ్యాఖ్యలను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఈటల రాజేందర్ చేసిన కృషి ప్రజలకు తెలిసిందేనని, ఆయనపై విమర్శలు చేసే స్థాయి కౌశిక్ రెడ్డికి లేదని మండిపడ్డారు. ఈటల రాజేందర్‌పై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కమలాపూర్ మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్, బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్, బండి కళాధర్ తదితరులు మాట్లాడారు. హుజురాబాద్...