కుటుంబ తగాదాల నేపథ్యంలో పేదల ఇళ్లపై జేసీబీ దాడి!

కుటుంబ తగాదాల నేపథ్యంలో పేదల ఇళ్లపై జేసీబీ దాడి! రెండు ఇళ్లను కూల్చివేత.. ధ్వంసమైన సర్టిఫికెట్లు, నగదు, విలువైన వస్తువులుమా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? న్యాయం చేయాలని కన్నీటితో వేడుకుంటున్న బాధిత కుటుంబాలునర్సంపేట మండలం రాజేశ్వరా వు పల్లి గ్రామంలో కుటుంబ తగాదాల నేపథ్యంలో పేద కుటుంబాలకు చెందిన రెండు ఇళ్లను జేసీబీతో కూల్చివేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన శనివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో చోటుచేసుకున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.కీసరి రాజేష్ రావు, కీసర ఇంద్రయ్యలపై బాధిత కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తూ, తమకు ఎవరూ లేని సమయంలో జేసీబీ తీసుకొచ్చి ఇళ్లను కూల్చివేశారని ఆవేదన...