పేద మహిళలే టార్గెట్: అండాల అక్రమ రవాణా కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

అండాల అక్రమ సేకరణ కేసులో దర్యాప్తు విస్తృతం ప్రధాన నిందితుడి విచారణలో వెలుగులోకి కీలక ఆధారాలు  హైదరాబాద్‌లోని ఒయాసిస్ కార్పొరేట్ ఆఫీసులో పోలీసుల తనిఖీలు  వ్యవస్థీకృత ముఠాలు, ఫర్టిలిటీ కేంద్రాల పాత్రపై లోతుగా విచారణ నకిలీ పత్రాలు, ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించిన పోలీసులు తెలంగాణ కెరటం నగరంలో సంచలనం సృష్టించిన అండాల అక్రమ సేకరణ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇది కేవలం కొందరి వ్యక్తిగత వ్యవహారం కాదని, దీని వెనుక వ్యవస్థీకృత ముఠాలు, పలు ఫర్టిలిటీ కేంద్రాల ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో దర్యాప్తును అన్ని కోణాల్లో విస్తృతం చేశారు. పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని, డబ్బు ఆశ...