మూడు గ్రామాల్లో సంపూర్ణ సౌర విద్యుదీకరణ.

‎కొండారెడ్డిపల్లి తరహాలో మరో రెండు గ్రామాల్లోనూ సోలార్ ప్రాజెక్టు అమలు చేయాలి.  ‎వ్యవసాయ అవసరాలకూ సౌర విద్యుత్ అందేలా కార్యాచరణ.  రైతులకు ప్రయోజనం చేకూర్చాలి.  ‎నాణ్యమైన విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు:  ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.  తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 28): ‎‎రాష్ట్రంలో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన సంపూర్ణ సౌర విద్యుదీకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన మూడు గ్రామాల్లో సంపూర్ణ సౌర విద్యుదీకరణ లక్ష్యాన్ని నిర్దేశిత ప్రమాణాలతో...