జిల్లా స్థాయి సోలో భరతనాట్యం పోటీల్లో రామేశ్వరంపల్లి విద్యార్థిని లక్ష్మికి ప్రథమ బహుమతి
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 28,(తెలంగాణ కెరటం)జిల్లా స్థాయిలో నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో ZPHS రామేశ్వరంపల్లి పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని లక్ష్మి సోలో భరతనాట్యం విభాగంలో ప్రథమ బహుమతి సాధించింది. తన అద్భుతమైన నృత్య ప్రదర్శనతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకుని మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.లక్ష్మి సాధించిన విజయంపై పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొట్టిపర్తి శ్రీనివాస్, సీనియర్ ఉపాధ్యాయులు నీలం శ్రీనివాస్, విద్యార్థినికి నృత్యంలో మార్గదర్శకత్వం వహించి ప్రోత్సహించిన నర్మదా మేడమ్తో పాటు ఉపాధ్యాయ బృందం లక్ష్మిని ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు కళలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ఆసక్తి...