ఎవని పాలవుతోంది తెలంగాణ..!!
ఎవని పాలవుతోంది తెలంగాణ..!! స్వ రాష్ట్రంలోనూ అందని ఫలాలు..నీళ్లు, నిధులు, నియామకాలు పరాయి పాలు ఆస్తులు పెంచుకునే పనిలో తెలంగాణ పాలకులు ఉద్యమకారులు, అమరవీరుల తల్లిదండ్రులకు మొండి చేయిదీక్ష దివాస్ సందర్భంగా ఖమ్మం సబ్ జైల్ ఎదుట ఉద్యమకారుల నిరసనతెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సోమయ్య తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు... ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక నిర్ణయాన్ని తీసుకునేలా చేసిన రోజు... వలస పాలనను తరమాలని మూడు కోట్ల ప్రజలు ఉవ్వెత్తున గొంత్తెత్తిన రోజు.. చరిత్రలో నిలచిన రోజు... ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబరు 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను గుర్తు చేసుకుంటూ...