తాటి బెల్లం చాయ్ సెంటర్‌ను సందర్శించిన డా.రఘు

తాటి బెల్లం చాయ్ సెంటర్‌ను సందర్శించిన డా.రఘు తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 29 : తెలంగాణ రక్షణ సేన కోరుట్ల మండల జనరల్ సెక్రటరీ మోత్కూరి శివగౌడ్‌కు చెందిన ‘వారణాసి తాటి బెల్లం చాయ్ అండ్ కాఫీ సెంటర్’ను ఆదివారం తెలంగాణ రక్షణ సేన కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి డా. రఘు పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఇటీవల ప్రారంభమైన ఈ సెంటర్‌ను సందర్శించిన డా. రఘు తాటి బెల్లంతో తయారుచేసిన చాయ్‌ను స్వయంగా అభిమానులకు అందించారు. ఈ సందర్భంగా తాటి బెల్లం సహజమైన తీపి పదార్థమని, సంప్రదాయ ఉత్పత్తులను ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించిన మోత్కూరి శివగౌడ్‌కు శుభాకాంక్షలు...