ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు ఉచిత వైద్య శిక్షణ

ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు ఉచిత వైద్య శిక్షణ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 29 : కిడ్నీ, మూత్ర సంబంధిత వ్యాధులపై ప్రముఖ వైద్యుల అవగాహన సదస్సు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన ప్రాథమిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం. శ్రీకాంత్ (యూరాలజిస్ట్), డాక్టర్ ఎం. సోమేశ్వర్ (జనరల్ మెడిసిన్) ఉచిత అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కిడ్నీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, మూత్రాశయంలో రాళ్లు, ప్రోస్టేట్ సమస్యలు, మూత్ర విసర్జన ఇబ్బందులు, యూరాలజికల్ క్యాన్సర్లు తదితర వ్యాధుల లక్షణాలు, ప్రాథమిక చికిత్స, రోగులను సరైన సమయంలో ఉన్నత వైద్యానికి ఎలా పంపించాలనే...