Friday, May 22, 2026
HomeUncategorizedఅన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం

అన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం

📰 Generate e-Paper Clip

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి కామారెడ్డి నియోజకవర్గం రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు గారు హాజరై లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నర్సింగ్ రావు మాట్లాడుతూకాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.ముఖ్యంగా సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు.ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేసి నిజమైన అర్హులైన పేదలకు అందజేస్తున్నామని తెలిపారు.గతంలో ఎన్నో కుటుంబాలు ఇల్లు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వారి కలలను సాకారం చేస్తోందని అన్నారు.పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలు కూడా పట్టణాల మాదిరిగా మంచి సౌకర్యాలతో జీవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గృహ నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేస్తోందన్నారు.ప్రతి పేద కుటుంబానికి ఇల్లు, విద్య, వైద్యం, ఉపాధి వంటి మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచి అధికారంలోకి తీసుకువచ్చారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మరియు షాబీర్ అలీ  నాయకత్వంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలన అందిస్తోందన్నారు. గ్రామ స్థాయిలో ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు అందేలా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాంమోహన్,స్థానిక సర్పంచ్ లత -శ్రీనివాస్,ఉప్పసర్పంచ్ దయానంద,మాజీ PACS చైర్మన్ స్వామి గౌడ్,తయారు,PACS చైర్మన్ పూలచంద్,మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి,కుక్కల రాజు,మాజీ జడ్పీటీసీ గ్యార సాయిలు,మాజీ ఎంపీటీసీ రేనా-చంద్రు నాయక్,మాజీ సర్పంచ్ మద్దెల రాజు,మాజీ ఉప్పసర్పంచ్ నవీన్ రెడ్డి,మాచారెడ్డి సర్పంచ్ సంతోష్ రెడ్డి,గొడుగుమర్రి తండా సర్పంచ్,రవి,ఉప్పసర్పంచ్ శంకర్, ఎల్లంపేట్ సర్పంచ్ లక్ష్మీరాజాం,నడిమి తాండ సర్పంచ్ కములు ,వెనుకతండా సర్పంచ్ స్వామి,బోడగుట్ట సర్పంచ్ సంతోష్,అంకిరెడ్డిపల్లి సర్పంచ్ శ్రీరామ్,గుంటితండా సర్పంచ్ శివాలాల్,సాయి కుమార్ గౌడ్,లడ్డు గౌడ్, రాహుల్ గౌడ్, ఎల్లంపేట్ 1వ వార్డ్ మెంబెర్ కసాల వికాస్ గౌడ్ (సన్నీ) పార్టీ నాయకులు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments