Friday, May 22, 2026
HomeUncategorizedవైద్యం వికటించి 8 నెలల పసికందు మృతి

వైద్యం వికటించి 8 నెలల పసికందు మృతి

📰 Generate e-Paper Clip

డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆసుపత్రి ముందు కుటుంబీకుల ఆందోళన…….

మెదక్ జిల్లా నర్సాపూర్ మే 19 (తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో 

వైద్యం వికటించి ఓ పసికందు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ పట్టణంలోని మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు కుటుంబీకుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. నర్సాపూర్ మండల పరిధిలోని జక్కపల్లి గ్రామానికి చెందిన మంజుల ఆంజనేయులు దంపతుల 8 నెలల పసికందుఅన్న  మనివర్ధన్  కు సోమవారం మూడు గంటల సమయంలో జ్వరం వచ్చిందని నర్సాపూర్ లోని అమ్మ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. అనంతరం బాలుడికి పరీక్షలు నిర్వహించిన ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకొని చికిత్సలు జరిపారు. అయితే మంగళవారం ఉదయం వైద్యులు పసికందు చిన్నారి మణి దీప్ పరిస్థితి విషమంగా ఉందని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు చెప్పారు. వెంటనే కుటుంబీకులు బాలుడిని అంబులెన్స్ లో సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. సంగారెడ్డి ఆసుపత్రిలో అక్కడి వైద్యులు పరీక్షించగా అప్పటికే బాలుడు చనిపోయినట్లు చెప్పారు. అమ్మ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని కావాలని పరిస్థితి విషమంగా ఉందని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించే విధంగా చేశారని కుటుంబీకులు ఆరోపించారు. పసి కందు బాలుడు మణికంఠ మృతికి కారణమైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు డిమాండ్ చేశారు. అమ్మ ఆసుపత్రిలో ఇటువంటి అల్లర్లు జరగకుండా ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments