Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఓటు హక్కును కాపాడుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే

Author
Posted By TELANGANA KERATAM
| 01 Nov 2026, 09:03 AM | 14 | EDITORIAL
ఓటు హక్కును కాపాడుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే

ఓటు హక్కును కాపాడుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే
ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో లోపాలపై సమగ్ర విచారణ జరపాలి – కేంద్ర ఎన్నికల సంఘం జవాబుదారీతనం వహించాలి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై వొడ్నాల శ్రీనివాస్ విమర్శ
తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు..మంచిర్యాల: ప్రజాస్వామ్యంలో ఓటు అనేది కేవలం ఒక గుర్తు కాదని, అది సామాన్యుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత శక్తివంతమైన హక్కు అని కాంగ్రెస్ పార్టీ రామకృష్ణాపూర్ (క్యాతనపల్లి) పట్టణ అధ్యక్షులు వొడ్నాల శ్రీనివాస్ అన్నారు. ప్రజల ఓటు హక్కును కాపాడుకోవడం అంటే దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడమేనని పేర్కొన్నారు.
మంత్రి వర్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ గడ్డం వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు చెన్నూరు నియోజకవర్గం నుంచి 30 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి న్యూఢిల్లీలో నవంబర్ 1న రాంలీలా మైదానంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో నిర్వహించనున్న ఓట్ బచావో... దేశ్ బచావో... కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరారు.
ఈ సందర్భంగా వొడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎవరి ఓటు ఉండాలి, ఎవరి ఓటు తొలగించాలి అనే విషయంలో ఎలాంటి అనుమానాలకు, అక్రమాలకు తావుండకూడదని స్పష్టం చేశారు.ఎస్. ఐ. ఆర్ ప్రక్రియలో పారదర్శకతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని, ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో వెలుగుచూస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న లోపాలు, అవకతవకలపై స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరపాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టలేకపోతున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ‌ను పదవి నుంచి తొలగించి, నిష్పక్షపాతమైన విచారణకు మార్గం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సంఘం అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేసే వ్యవస్థ కాదని, అది దేశ ప్రజాస్వామ్యానికి కాపలాదారుగా ఉండాలని అన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కోల్పోయే పరిస్థితి రావడం దేశానికి మంచిది కాదని హెచ్చరించారు.
ఓటు హక్కును కాపాడుకోవడం కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయ అంశం కాదని, ఇది దేశంలోని ప్రతి పౌరుడి హక్కుకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. అందుకే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ ఉద్యమంలో దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు, యువత, విద్యార్థులు, కార్మికులు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ తివారి ప్రసాద్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పైడిమల్ల నర్సింగ్, సేవాదళ్ అధ్యక్షులు హఫీజ్, మందమర్రి మునిసిపల్ అధ్యక్షులు మంద తిరుమల్ రెడ్డి, క్యాతనపల్లి మునిసిపాలిటీ కౌన్సిలర్లు గుర్రం శ్రీనివాస్, భీమ మల్లేష్, కూతురు ప్రభాకర్ , జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరి లక్ష్మణ్,ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నాగుల రాజ్ కుమార్, పట్టణ కార్యదర్శి భైర మల్లేష్, యువజన నాయకులు ఎండి ఇసాక్, జావెద్, పవన్ , పలువురు సర్పంచ్ లు , నాయకులు మరియు కార్యకర్తలు ఢిల్లీ కి బయలుదేరారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: