తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 2:
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం శెట్పల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ సౌజన్యంతో రైతులకి ఆర్ పి ల్ ఆధారిత శిక్షణ లో నూనె గింజల సాగుని ప్రోత్సహించడం మరియి తక్కువ నీటితో చిరుధాన్యల సాగుని విస్తరించడం పైన రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా భీంగల్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాధికా , మండల వ్యవసాయ అధికారి హరీష్ ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గిపోయే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని, జొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజల వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు.
అలాగే ఉద్యానవన అధికారి రాజగౌడ్ ఆయిల్‌పామ్ సాగు ప్రాముఖ్యతను, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు మరియు ప్రోత్సాహకాలను వివరించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చిరుధాన్యాల సాగు ప్రాముఖ్యతను కూడా రైతులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ్, ఏఈఓ మహేష్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.



