విద్యార్థులకు పొగాకు దుష్ప్రభావాలపై అవగాహన
తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిథి నవంబర్ 2
మద్దూర్ మండల కేంద్రంలో పేదిరిపహాడ్ గ్రామంలో పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పేదిరిపహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం రోజు పొగాకు వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొగాకు, గుట్కా, ఖైనీ, సిగరెట్ వంటి ఉత్పత్తుల వినియోగం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్‌తో పాటు ఇతర ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వివరించారు. పొగాకు అలవాటు ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా కుటుంబాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. విద్యార్థులు చిన్న వయస్సు నుంచే పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని, తమ కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా పొగాకు వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు....



